
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.) గత కొద్ది రోజులుగా ఏపీలో వివిధ ప్రాంతాలను అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అందులో గ్రామాల్లో డయేరియా కేసులు పెరగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ డయేరియా కేసులు ఏదో ఒక గ్రామంలో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ డయేరియా తీవ్రతపై ఆయన ఆరా తీశారు. తక్షణమే ఆ గ్రామాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించి, సమగ్ర నివేదిక అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV