
తిరుమల, 1 డిసెంబర్ (హి.స.)
దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈ రోజు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో తిరుమల కొండపై ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో భక్తులంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి టీటీడీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రోజు మొత్తం అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అంతేకాకుండా కొండ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉండటం వలన, ఘాట్ రోడ్లపై దృశ్యమానత (Visibility) గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు, చలిని పెంచే బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఉష్ణోగ్రత సాధారణం కంటే చాలా తక్కువగా అనిపించవచ్చు.
ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, భక్తులు తప్పనిసరిగా గొడుగులు/రెయిన్‌కోట్లు, వెచ్చని దుస్తులు వెంట తీసుకురావాలని టీటీడీ (TTD) తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV