విశాఖలో దేశంలోనే పొడవైన 'గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి' ప్రారంభం
విశాఖపట్నం , 1 డిసెంబర్ (హి.స.) విశాఖపట్నం పర్యాటక రంగంలో సరికొత్త ఆకర్షణకు ప్రభుత్వ తెరలేపింది. కైలాసగిరి కొండపై రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి (Glass Skywalk Bridge)ను ఎంపీ ఎం. శ్రీభరత్ అధికారికంగా ప్రారంభించ
డ్జి' ప్రారంభం


విశాఖపట్నం , 1 డిసెంబర్ (హి.స.)

విశాఖపట్నం పర్యాటక రంగంలో సరికొత్త ఆకర్షణకు ప్రభుత్వ తెరలేపింది. కైలాసగిరి కొండపై రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి (Glass Skywalk Bridge)ను ఎంపీ ఎం. శ్రీభరత్ అధికారికంగా ప్రారంభించారు. దీంతో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జీగా రికార్డుల్లోకి ఎక్కి.. పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది.. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో వీఎంఆర్‌డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఈ బ్రిడ్జి, దాదాపు 55 మీటర్ల పొడవుతో దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. ఈ బ్రిడ్జి సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉండటం విశేషం.

జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 ఎంఎం మందం గల లామినేటెడ్ గాజుతో నిర్మించిన ఈ స్కై వాక్ బ్రిడ్జి, ఒకేసారి 500 టన్నుల భారాన్ని మోయగల సామర్థ్యం కలిగి ఉంది. అత్యున్నత భద్రతా ప్రమాణాల మధ్య నిర్మించబడిన ఈ వంతెనపైకి ఒకేసారి గరిష్టంగా 40 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. ఈ బ్రిడ్జిపై నుంచి బంగాళాఖాతం, తూర్పు కనుమలు, విశాఖ నగరం యొక్క అద్భుతమైన పాక్షిక వీక్షణను పర్యాటకులు ఆస్వాదించవచ్చు. ఈ కొత్త పర్యాటక కేంద్రం విశాఖ నగరానికి మరింత మంది పర్యాటకులను ఆకర్షించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande