జడ్చర్లలో ఏసీబీ సోదాలు.. పట్టబడిన అవినీతి తిమింగలం
నాగర్ కర్నూల్, 10 డిసెంబర్ (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా జడ్చర్లలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. వెల్దండ మండలం లో విద్యుత్ శాఖ కార్యాలయ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఇన్చార్జి వెంకటేష్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రైతు నుండి 15,000 లంచం తీసుకుంటుండగా ప
ఏసీబీ సోదాలు


నాగర్ కర్నూల్, 10 డిసెంబర్ (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా జడ్చర్లలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. వెల్దండ మండలం లో విద్యుత్ శాఖ కార్యాలయ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఇన్చార్జి వెంకటేష్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రైతు నుండి 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. ఏఈ ఇంటికి తాళం వేసి ఉండడంతో చాలా సేపు వేచి ఉన్నా ఇంటికి ఎవరూ రాకపోవడంతో చివరికి ఇంటి గడియ ఇరగ్గొట్టి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande