
అమరావతి, 10 డిసెంబర్ (హి.స.)గ్రామ శుభ్రత కోసం పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు (Green Ambassdors) జీతాల కోసం ఇబ్బంది పెడితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో మంగళగిరిలో నిర్వహించిన మాటా మంతి (Maata Manthi) కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారులు మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో గ్రీన్ అంబాసిడర్ల నియామకం జరిగిందన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అయితే జీతాల విషయంలో వారికి తరచూ ఇబ్బందులు తప్పడం లేదని డిప్యూటీ సీఎంకు తెలిపారు. కొన్ని గ్రామాల్లోని సర్పంచులు గ్రీన్ అంబాసిడర్లను జీతాలు ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వారికిచ్చే జీతాలు చాలా తక్కువనే అయినప్పటికీ వాటిని కూడా చెల్లించడంలో తాత్సారం జరుగుతోందని అధికారులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV