
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) నేడు జరిగిన
తెలంగాణ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయింది. ఇవాళ జరిగిన ఎన్నికలలో 84.28 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 92.88 శాతం నమోదు కాగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం ఓట్లు పోలయ్యాయి. మొదటి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.-
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..