ఏ దేశం వెళ్లిన అత్యధిక తలసారి ఆదాయం సంపాదించేది తెలుగువారే : సీఎం
అమరావతి, 10 డిసెంబర్ (హి.స.) ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను పెంచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారేన్నారు
చంద్రబాబు


అమరావతి, 10 డిసెంబర్ (హి.స.)

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను పెంచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారేన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లేవారిలో అధిక శాతం తెలుగువారే ఉంటారన్నారు. ప్రపంచం తెలుగువారి ప్రతిభను గుర్తించిందని, అది మన బ్రాండ్ అని ఆయన పేర్కొన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు (Vishaka CII Summit) ద్వారా రాష్ట్ర బ్రాండ్‌ను తాము సరిదిద్దామని, ఈ సదస్సు ద్వారా 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించడానికి తాను గర్వపడుతున్నానని తెలిపారు. ఇప్పటికే ఎస్ఐపీబీ (State Investment Promotion Board) ద్వారా రూ. 8.29 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక పారిశ్రామిక పార్కులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంటులో ప్రస్తావించిందని గుర్తు చేశారు.

​ఆర్థిక వృద్ధి విషయంలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోందని సీఎం వివరించారు. మొదటి ఏడాది 12.02 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు వచ్చిందని, రెండో త్రైమాసికానికి 11.28 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ 8.7శాతం వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ అని చెప్పారు. ఈ ఏడాది 17 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి త్రైమాసికానికి 40 నుంచి 42 శాతం, రెండో త్రైమాసికానికి 50 నుంచి 56 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande