
భద్రాద్రి కొత్తగూడెం, 10 డిసెంబర్ (హి.స.)
చర్ల మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఇందులో భాగంగా చర్లలో గల ఆసుపత్రిని ఆయన సందర్శించారు. వివిధ విభాగాలను ఆకస్మికతనికి నిర్వహించారు. చికిత్స నిమిత్తం వచ్చిన రోగులతో ఆయన మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయంటూ ఆరా తీశారు. రేపు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్ వెంట పలువురు అధికారులు, తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు