వీరికి రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు.. సరిహద్దు గ్రామాల విశేషం
ఆసిఫాబాద్, 10 డిసెంబర్ (హి.స.) తెలంగాణ మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు చర్చలోకి వస్తాయి. లోక్ సభ, అసెంబ్లీ నుంచి మొదలు కొని స్థానిక సంస్థల ఎన్నికల వరకు...!ఈ గ్రామాల్లోని ఒక వ్యక్తి రెండు సార్లు
రెండు రాష్ట్రాల ఓట్లు


ఆసిఫాబాద్, 10 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు చర్చలోకి వస్తాయి. లోక్ సభ, అసెంబ్లీ నుంచి మొదలు కొని స్థానిక సంస్థల ఎన్నికల వరకు...!ఈ గ్రామాల్లోని ఒక వ్యక్తి రెండు సార్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలైన అంతాపూర్, బోలాపటార్, పరందోలి, ముకుదంగూడ, శంకర్ లొద్ది, గౌరి, లెండిగూడ, కోట, ఇంద్రనగర్ తదితర వివాదాస్పద గ్రామాల ప్రజలు నేడు జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తమ వినియోగించుకోనున్నారు.

2024 నవంబర్ 20న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజుర అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికకు.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంతో పాటు మహారాష్ట్ర ఎంపీ స్థానం ఎన్నికల్లో ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ గ్రామాల ప్రజలు ఇప్పుడు ఐదోసారి పంచాయతీ ఎన్నికలకు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. సుప్రీం కోర్టులో కేసునేపథ్యంలో రెండు రాష్ట్రాలు పాలించడంతో పాటు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించే అరుదైన అవకాశం లభించింది. వచ్చే జనవరిలో మహారాష్ట్రలో జరిగే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా మళ్ళీ స్పల్ప వ్యవస్థలో పంచాయతీ ఎన్నికలకు ముచ్చటగా రెండోసారి వీరు ఓటు వేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande