
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్లాలంటే ధైర్యం కాదు, అభిమానం ఉండాలని, 108 యేండ్ల చరిత్ర గల ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్స్ ఫర్డ్ స్టాండర్డ్ యూనివర్సిటీ తరహాలో తీర్చిదిద్దేందుకు రూ . వెయ్యి కోట్ల జీవో తో ఓయూకి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూ విద్యార్థులు గొప్ప మేధావులుగా ఎదగండి అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు. ఇక్కడే తొలిదశ ఉద్యమం పుట్టింది, ఆ ఉద్యమం ఫలించకపోవడంతో విద్యార్థులు అడవి బాట పట్టారని ఆయన గుర్తు చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను, నాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికగా రూపొందించడం కోసం ఇక్కడికి రావడం జరిగిందన్నారు. మీరు ఓయూకు వెళ్తున్నారు కదా ఇది చదవండి అని అధికారులు స్క్రిప్ట్ తెచ్చి ఇచ్చారని, చదువుకుని వెళితే ఓయూకు వెళ్లడం వేస్ట్, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాన్ని, నాకు కొత్తగా మీరు రాసి ఇచ్చి మా తమ్ముండ్లు, చెల్లెండ్ల ముందట మాట్లాడించే ప్రయత్నం చేయకండి అని వారించినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..