
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు
రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి ప్రజలను ట్రాప్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ మణికొండ వేదకుమార్ వాట్సాప్ నెంబను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తనకు డబ్బులు అర్జంట్గా అవసరం ఉందని వేదకుమార్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. తాను ఎప్పుడు ఉపయోగించే యూపీఏ నంబర్ పని చేయడం లేదని 6202756958 నెంబర్ క గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా అత్యవసరంగా రూ.60 వేలు పంపించాలని మెసేజులు పంపుతున్నారు. కాగా ఈ సైబర్ చీటర్ల పనే అని గ్రహించిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని స్క్రీన్ షార్ట్ తీసి మిగతా వారికి పంపి అప్రమత్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..