
తిరుమల, 10 డిసెంబర్ (హి.స.)
వచ్చే ఏడాది జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం), 29న (వైకుంఠ ఏకాదశి ముందు రోజు), డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు), జనవరి 25 (రథ సప్తమి) కారణంగా ఈ పర్వదినాల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తితిదే ప్రకటనలో పేర్కొంది. పర్వదినాలకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి భక్తులు దేవస్థానం సిబ్బందికి సహకరించాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ