
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ నగర శివార్లలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏకకాలంలో పలుచోట్ల దాడులు కొనసాగుతున్నాయి.
ఫ్రీ లాంచీ స్కీమ్ పేరుతో కస్టమర్ల నుంచి భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు రూ.70 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫ్లాట్లు, ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణలో భాగంగా ఇవాళ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..