
సూర్యాపేట, 10 డిసెంబర్ (హి.స.)
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రీ పంపిణీ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్ బుధవారం పరిశీలించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించి, ఏర్పాట్లు, నిర్వహణ పద్ధతులు, సిబ్బంది కేటాయింపు పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలను జరిపించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు