నగరంలోని.ఆర్కే బీచ్ రోడ్డులో ను ఓ అపార్ట్మెంట్.లో. అగ్నిప్రమాదం
అమరావతి, 10 డిసెంబర్ (హి.స.) విశాఖపట్నం: నగరంలో ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ బృందాలు సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. న
నగరంలోని.ఆర్కే బీచ్ రోడ్డులో ను ఓ అపార్ట్మెంట్.లో. అగ్నిప్రమాదం


అమరావతి, 10 డిసెంబర్ (హి.స.)

విశాఖపట్నం: నగరంలో ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ బృందాలు సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. నోవాటెల్‌ హోటల్‌ పక్కన ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ పదో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు పూజ గదిలో దీపం వెలిగించగా అది కిందపడటంతో మంటలు చెలరేగాయి. కేవలం ఆ ఫ్లాట్‌కు మాత్రమే నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande