శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి : ఎస్పీ డాక్టర్ శబరిష్
మహబూబాబాద్, 10 డిసెంబర్ (హి.స.) గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధి పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ శబరీష్ బుధ
ఎస్పీ శబరీష్


మహబూబాబాద్, 10 డిసెంబర్ (హి.స.) గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధి పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ శబరీష్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతిభద్రతలు దృఢంగా ఉండేలా సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఉదయం నుంచే పోలీసులు తమ స్థానాల్లో చేరి, ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయడానికి అన్ని రకాల సౌకర్యాలు, భద్రతా చర్యలను ఎంచుకుంటారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపుల గుమికూడింపులు పూర్తిగా నిషేధం అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande