
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
కోట్లు ఖర్చు చేసి గ్లోబస్ సమ్మిట్ అట్టర్
ఫ్లాప్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు, విజన్ డాక్యుమెంట్ కాదు, 'విజన్లెస్' డాక్యుమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు.
అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు