సిగాచీ ప్రమాదంపై అధికారులపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) సిగాచీ ప్రమాదంపై విచారణలో అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. ఘటనపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రిటైర్డ్ సైంటిస్ట్ కలపల బాబూరావు దాఖలు చేసిన పిల్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. రెడ్ జోన్ ఫ్యాక్ట
హైకోర్టు సీరియస్


హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)

సిగాచీ ప్రమాదంపై విచారణలో

అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. ఘటనపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రిటైర్డ్ సైంటిస్ట్ కలపల బాబూరావు దాఖలు చేసిన పిల్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. రెడ్ జోన్ ఫ్యాక్టరీలలో ఎందుకు తనిఖీలు చేయడం లేదని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. రెడ్ జోన్ లో ఉన్న పరిశ్రమలు తప్పనిసరిగా అమలు చేయల్సిన చట్టాల గురించి ప్రశ్నల వర్షం కురిపించింది. కార్మిక, ప్రావిడెంట్ ఫండ్ శాఖలు ఏం చేస్తున్నాయని అడిగింది. హైకోర్టు వేసిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్, అధికారులు మౌనంగా ఉండిపోయారు. సిగాచీ రెడ్ కేటగిరీ పరిధిలో ఉన్న పరిశ్రమల కాబట్టి 12శాఖల అధికారులు నిర్ణీత వ్యవధిలో తనిఖీ చేయాల్సి ఉందని.. అది జరిగిందా అని ప్రశ్నించింది.

దీనికి అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు సంసిద్ధంగా లేరు మీపై ఒత్తిళ్లు ఉన్నాయా.. ఉంటే మీకంటే ఉన్నతాధికారులతో దర్యాప్తునకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. లేదంటే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాల బలం రోజురోజుకు పెరిగిపోతుందని, కాంట్రాక్టు కార్మికుల గొంతు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మిగితారికి గుణపాఠం రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande