రేపటి ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు.. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, 10 డిసెంబర్ (హి.స.) ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొదటి విడత డిసెంబ
కలెక్టర్ అనుదీప్


ఖమ్మం, 10 డిసెంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొదటి విడత డిసెంబర్11న ఏడు మండలాల పరిధిలోని 172గ్రామ పంచాయతీలు, 1415 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2 లక్షల 41 వేల 137 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని, ఇందులో ఒక లక్షా 16వేల 384 మంది పురుష ఓటర్లు, లక్షా 24 వేల 743 మంది మహిళలు, ఇతరులు 10మంది ఉన్నారని తెలిపారు. మొదటి దశ 192గ్రామ పంచాయతీల్లో 20గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, 172గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నిక కోసం 488 మంది బరిలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు..

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande