నాగపూర్ టూ ఓరుగల్లు గంజాయి రవాణా లో.విద్యార్ధుల
వరంగల్‌ :, 10 డిసెంబర్ (హి.స.) వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో నార్కోటిక్‌ ఠాణా, మత్తు పదార్థాల నిరోధక విభాగం ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన స్మగ్లర్స్‌ ఇక్కడ విద్యార్థులకు ఇచ్చి విక్రయించ
నాగపూర్ టూ ఓరుగల్లు గంజాయి రవాణా లో.విద్యార్ధుల


వరంగల్‌ :, 10 డిసెంబర్ (హి.స.) వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో నార్కోటిక్‌ ఠాణా, మత్తు పదార్థాల నిరోధక విభాగం ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన స్మగ్లర్స్‌ ఇక్కడ విద్యార్థులకు ఇచ్చి విక్రయించేవారు. గంజాయికి అలవాటుపడ్డవారు పలు ప్రాంతాల్లో తిరుగుతూ కొనుగోలు చేస్తున్నారు. రవాణాతోపాటు తాగేవారు 16 నుంచి 25 ఏళ్లలోపు ఉన్నవారే ఎక్కువగా పట్టుబడుతున్నారు. కొంత మంది విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై నాగ్‌పుర్‌కు వెళ్లి గంజాయి తెచ్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా దృష్టి సారించారు. చిన్నచిన్న ప్యాకెట్లలో తెచ్చిన విద్యార్థులు తమ స్నేహితులకు విక్రయిస్తున్నారు. నగర శివారులోని పలు ప్రైవేటు కళాశాలల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande