
ఆదిలాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఆయనను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జ పటేల్ ను ప్రజలు నిలదీశారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని జనం ప్రశ్నించారు. దాంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. గ్రామాల్లో జనం తనను అడ్డుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని బెదిరించారు. కోపంతో చిందులు వేశారు.
'మీ గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి..' అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..