
జగిత్యాల, 10 డిసెంబర్ (హి.స.)
విద్యార్థులు కష్టపడి చదివి విజయాలు సాధించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్, బాయ్స్ హై స్కూల్లను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కావద్దని, ధైర్యంగా, పట్టుదలతో రాసి మంచి ఫలితాలు సాధించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు