
కరీంనగర్, 10 డిసెంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండలంలోని కరీంపేట గ్రామంలో బుధవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కరీంపేటను వల్లకాడుగా మార్చిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోవద్దని సూచించారు. అలాంటి వారికి ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామంలో వర్గ పోరు రాజకీయాలు పెంచుతారని పేర్కొన్నారు. గతంలో వారి అరాచకాలు, భూ కబ్జాలతో గ్రామం అట్టుడికి పోయిందన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రభుత్వం, ఎమ్మెల్యే అండ చూసుకొని ఈ గ్రామంలో భూ కబ్జా కోర్లు రెచ్చిపోయారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు