మా స్టార్టప్లకు గూగుల్ రావడం చాలా సంతోషకరం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్ట్ ప్స్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడిన శ్రీధర్ బాబు.. మేం అధికారంలోకి వచ్చి
మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)

స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్ట్ ప్స్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడిన శ్రీధర్ బాబు.. మేం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇదో కొత్త ప్రారంభం కొత్త ప్రయాణం అని మాస్టార్టప్ లకు గుగుల్ మెంటార్ గా ఉండటం చాలా సంతోషకరం అన్నారు. ఇక ఇప్పుడు యూనికార్న్ సంస్థలకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. యూనికార్న్ లను తయారు చేయడం కోసమే ఈ కేంద్రం ఉందని 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయన్నారు. ఒక లక్ష్యం అంటూ ఉండేనే ప్రగతి పథకంలో దూసుకెళ్లగలం అన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని దేశంలోని మొదటి ప్రైవేట్ రాకెట్ హైదరాబాద్ లోనే తయారైందన్నారు. టీహబ్ కు గూగుల్ రప్పించేందుకు చాలా శ్రమించాం. ఇది దేశంలోనే మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande