దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్ పంపాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, 10 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీలో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్ను పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల సిబ్బందికి సూచించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్
నల్గొండ కలెక్టర్


నల్గొండ, 10 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీలో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్ను పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల సిబ్బందికి సూచించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డీఆర్సీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసే సమయంలో స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పేపర్ల ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande