నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు వద్ద అయ్యప్ప స్వామి పంబ ఆరట్టు వేడుకలు
నర్సంపేట, 10 డిసెంబర్ (హి.స.), : నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై అయ్యప్పస్వామి పంబ ఆరట్టు వేడుకలు మంగళవారం కనుల పండువగా నిర్వహించారు. మాదన్నపేట చెరువు కట్టపై రామలింగేశ్వరస్వామి దేవాలయం మెట్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శబరిమ
నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు వద్ద అయ్యప్ప స్వామి పంబ ఆరట్టు వేడుకలు


నర్సంపేట, 10 డిసెంబర్ (హి.స.), : నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై అయ్యప్పస్వామి పంబ ఆరట్టు వేడుకలు మంగళవారం కనుల పండువగా నిర్వహించారు. మాదన్నపేట చెరువు కట్టపై రామలింగేశ్వరస్వామి దేవాలయం మెట్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శబరిమల దేవాలయం మేల్‌ శాంతి శంకరన్‌ నంబూద్రి, ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్‌ మిశ్ర ఆధ్వర్యంలో తాంత్రిక పద్ధతిలో పూజలు చేశారు. చెరువులో అయ్యప్పస్వామికి జల క్రీడలను నిర్వహించి వేదికపై పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మహా అన్నదాన దాతగా వ్యవహరించారు. వేడుకను తిలకించేందుకు నర్సంపేట డివిజన్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande