
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్
పబ్లిక్ ఎంటర్ప్రైజ్'లో హిందూ దేవతల గురించి ప్రొఫెసర్ భట్టాచారి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వేదాలు, భగవత్ గీతలో ఏ దేవుళ్ల విగ్రహాల గురించి ప్రస్తావించారని అన్నారు. ఎందుకు విగ్రహాలను పూజిస్తున్నారని వ్యాఖ్యానించారు. హనుమంతుడు, భక్త ప్రహల్లాదుడి చరిత్రపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించాలని వీహెచ్పీ జాతీయ కార్యదర్శి శశిధర్ కోరారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో హిందూ దేవుళ్లను తిట్టడానికి లైసెన్స్ ఇచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టాచార్య గత చరిత్ర మొత్తం వివాదాస్పదం అని అన్నారు.
అతని తక్షణం అరెస్ట్ చేయకపోతే హిందూ సమాజం రోడ్లపైకి వస్తుందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు