అంతా నిశ్శబ్దం.. ముగిసిన మొదటి విడత ప్రచారం!
మెదక్, 10 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమరం ముగిసింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 11న జరిగే పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేస్తుండగా అభ్యర్థులు మాత్రం ఓటర్ల
సర్పంచ్ ఎలక్షన్స్


మెదక్, 10 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమరం ముగిసింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 11న జరిగే పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేస్తుండగా అభ్యర్థులు మాత్రం ఓటర్లు ప్రలోభాలు పర్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేసేందుకు సిద్ధం అయ్యారు. మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. జిల్లా ఉన్న 492 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 6 మండలాల్లో ఎన్నికలు ఈ నెల 11న నిర్వహిస్తున్నారు.

ఎన్నికలు జరిగే 144 సర్పంచ్ స్థానాలతో పాటు 1072 వార్డు స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులు గత వారం రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీ అర్ ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు సైతం బరిలో ఉన్న మద్దతుదారుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande