కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా మరో 14 మంది విద్యార్థులకు గాయాలు అయినవి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా మరో 14 మంది విద్యార్థులకు గాయాలు అయినవి.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే గ్రామం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి ప్రణవ్(15) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలైన మరో 14 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande