
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిఫ్టులు పంపుతున్నారు. కొందరు చికిన్, మటన్ పంపుతుంటే, మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు పంచబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తెలంగాణలోని 4, 236 గ్రామాల్లో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్ కు ముందు రోజు నుంచి చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు