
సూర్యాపేట, 10 డిసెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు దారుణ హత్యకు దారి తీశాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ కార్యకర్తలు గత రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడికి పాల్పడ్డారు. 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఈ దాడిలో 15 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో గ్రామంలో పోలీసులు మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు