సర్పంచ్ ఎన్నికలు ముగియగానే.. నామినేటెడ్ పోస్టులు.. మహేశ్ కుమార్ గౌడ్ గుడ్ న్యూస్
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూసి హరీశ్రావుకు గుబులు పట్టుకుందన్నారు. ఇవాళ సీఎల్పీలో
మహేష్ కుమార్


హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూసి హరీశ్రావుకు గుబులు పట్టుకుందన్నారు. ఇవాళ సీఎల్పీలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పాలన.. మా రెండేళ్ల పాలనపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ వల్ల దేశ విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి విజన్, దూరదృష్టికి గ్లోబల్ సమ్మిట్ నిదర్శనం అన్నారు.

నెలాఖరులోపు కార్పొరేషన్ ఛైర్మెన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ అన్నారు. నూతన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీలు వస్తాయన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande