ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే.. ఎస్ఈసీ రాణి కుముదిని కీలక ప్రకటన
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. పంచాయతీ
ఎన్నికల సంఘం


హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందని అన్నారు. పోలింగ్ పూర్తి అవ్వగానే కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే ఉంటుందని స్పష్టం చేశారు. 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్ జరగనుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెకోపోస్టులు ఏర్పాటు చేశామని, తొలి విడతలో భాగంగా 395 గ్రామాల్లో ఏకగ్రీవం ఎన్నిక జరిగిందని రాణి కుముదిని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande