
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.)
ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర
ప్రభుత్వం రూ. 1000 కోట్లు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఓయూ క్యాంపస్లో పర్యటించారు. ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద ఏర్పాటు చేసిన సర్వం సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు.
హాస్టళ్ల ఆధునీకరణ, అకడమిక్ బ్లాక్ నిర్మాణం, ఇతర విద్యార్థి సౌకర్యాలపై సీఎం పర్యటనలో తుది సమీక్ష నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..