
యాదాద్రి భువనగిరి, 10 డిసెంబర్ (హి.స.) గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా జరగనున్నమొదటి విడత ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికలు జరగనున్న తుర్కపల్లి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణి తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు