
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న అఖండ-2 సినిమాకు మరో అనూహ్య షాక్ తగిలింది. అఖండ - 2 సినిమాకు టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారించిన కోర్టు.. ప్రీమియర్ షో రేట్లు పెంపు జీవో సస్పెన్షన్ విధించింది. ప్రీమియర్ షోలతో పాటు టికెట్లు రేట్ల పెంపు సర్క్యూలర్ను రద్దు చేసింది. తెలంగాణ హోంశాఖ, అఖండ-2 సినిమా నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. తెలుగు ఫిల్మ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కూడా నోటీసులు ఇచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు