రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు
అమరావతి, 13 డిసెంబర్ (హి.స.) రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు ఇవ్వటానికి సీఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో 4,929 మంది పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి నెలకు ర
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు


అమరావతి, 13 డిసెంబర్ (హి.స.) రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు ఇవ్వటానికి సీఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో 4,929 మంది పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వటానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. రాజధానికి భూసమీకరణ జరిగిన సమయంలో భూమి లేని పేదలకు ఉపాధికి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 4,929 మంది పేదలు పెన్షన్లు తీసుకునేవారు.

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు నిలిపివేయటంతో పాటు.. పేదలకు పెన్షన్లు రద్దు చేసింది. ఇప్పుడు వారందరికీ పునరుద్దరించేందుకు సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాల్లో పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలని కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామసభల సమయంలోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని కమిషనర్ కన్నబాబు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande