
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయని సూచిస్తూ సంస్థ కీలక ప్రకటన చేసింది. వరుసగా రెండో రోజు 2,050కి పైగా విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో తెలిపింది, ఇది కార్యకలాపాల సాధారణీకరణ కొనసాగింపును స్పష్టం చేస్తోందని విశ్లేషకులు తెలుపుతున్నారు.
తాజా ప్రకటన ప్రకారం.. ఇండిగో యొక్క నెట్వర్క్లోని మొత్తం 138 గమ్యస్థానాలు తిరిగి అనుసంధానం చేయబడ్డాయి. సమయపాలన సాధారణంగా ఉందని, డిసెంబర్ 12న కేవలం రెండు విమానాలు మాత్రమే సాంకేతిక సమస్యల కారణంగా రద్దు అయ్యాయని, ఆ ప్రయాణికులను తక్షణమే ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దుబాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇటీవలి రోజుల్లో వందల సంఖ్యలో విమానాలు రద్దు అయిన నేపథ్యంలో, ఇండిగో తిరిగి 2,000 మార్కును దాటి విమానాలను నడపడం అనేది వినియోగదారులకు, ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించే విషయం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు