మొదటి విడత పోలింగ్.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ఆసిఫాబాద్, 11 డిసెంబర్ (హి.స.) జిల్లాలో మొదటి విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి పోలీసు శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జైనూర్ మండల కేంద్రంలోని ZPHS పోలింగ్ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎఎ
ఆసిఫాబాద్ ఏఎస్పీ


ఆసిఫాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

జిల్లాలో మొదటి విడత జరుగుతున్న

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి పోలీసు శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జైనూర్ మండల కేంద్రంలోని ZPHS పోలింగ్ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్ గురువారం సందర్శించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ASP అక్కడి పరిస్థితులను, భద్రతా బందోబస్తును, పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ.. సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, చట్టం & శాంతి భద్రతల పరిరక్షణనే ప్రాధాన్యంగా తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande