
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో )భవాని దీక్ష విరమణల)ఈరోజు(గురువారం) నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. ఇంద్రకీలాద్రిలో 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.హోమ గుండాలను దుర్గ గుడి ఈవో, చైర్మన్, ఆలయ స్థానాచారి వెలిగించారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో మార్మోగుతోంది ఇంద్రకీలాద్రి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రాగాంధీ మీడియాతో మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ