ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ లను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలను కలిసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ లను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలను కలిసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు సీఎం వివరించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande