రూ. లక్ష కోట్ల కేంద్ర నిధులతో రోడ్ల పనులు.. మారనున్న రాష్ట్ర రవాణా ముఖచిత్రం
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా విలువైన పనులు ఏకకాలంలో జరుగుతుండడంతో రాష్ట్ర రవాణా ముఖచిత్రం మారిపోనున్నది. గ్రామీణ రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకు నాణ్యమైన రోడ్లను నిర్మ
కేంద్ర నిధులు


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా విలువైన పనులు ఏకకాలంలో జరుగుతుండడంతో రాష్ట్ర రవాణా ముఖచిత్రం మారిపోనున్నది. గ్రామీణ రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకు నాణ్యమైన రోడ్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తాజాగా, ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 16,932 కి.మీ రోడ్ల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో జాతీయ రహదారుల వాటా అత్యధికం కాగా, గ్రామీణ రోడ్లకు సైతం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇందులో కొత్తగా నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్, హ్యామ్ రోడ్లు సైతం ఉన్నాయి

ఎన్ హెచ్ ఏఐ పరిధిలో రూ.44,195 కోట్లతో 969 కిలోమీటర్ల మేర 21 ఎక్స్ ప్రెస్ హైవేలు, హై స్పీడ్ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగమైన రీజినల్ రింగ్ రోడ్డు పనులకు త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు రూ. 17 వేల కోట్లకు పైగా నిధులతో ఎన్ హెచ్ (ఆర్ అండ్ బీ) ఆధ్వర్యంలో 1,284 కిలోమీటర్లకు పైగా పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్లు, బిల్డింగుల పనులు కలిపి రూ. 1 లక్ష కోట్లు దాటగా, అందులో సగానికి పైగా కేంద్రం నిధులే ఉండటం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande