
సింహాచలం, 11 డిసెంబర్ (హి.స.)
: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలానికి డబుల్ డెక్కర్ సర్వీసు ప్రారంభమైంది. విశాఖపట్నంలో పర్యాటక ఆకర్షణగా ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను సింహాచలం వరకు పొడిగించారు. గురువారం నుంచి వీటిని ప్రారంభించినట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు. నగర పర్యాటకులతో పాటు సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ