ఏపీ, తెలంగాణలో నకిలీ రేషన్ కార్డుల రద్దు: కేంద్రం ప్రకటన
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలల కాలంలో ఏకంగా 1,40,947 రేషన్ కార్డులు రద్దయి
రేషన్ కార్డులు


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో

భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలల కాలంలో ఏకంగా 1,40,947 రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించారు. అనర్హులుగా గుర్తించడం, నకిలీ కార్డుల ఏరివేత, లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, కార్డుదారుల మరణం వంటి కారణాల వల్ల ఈ కార్డులను రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 56.60 లక్షల రేషన్ కార్డులు అమల్లో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 50,681 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మొత్తం 88.37 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నట్లు కేంద్రం లోక్సభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande