భద్రాద్రి కొత్తగూడెం-మణుగూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం, 11 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు ZPHS ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావర
లోకల్ ఎలక్షన్


భద్రాద్రి కొత్తగూడెం, 11 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు ZPHS ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినా వినకుండా కార్యకర్తలు ప్రచారం చేయడంతో ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు వినకుండా తమ గుర్తు పేరు గట్టిగా చెబుతూ పోలింగ్ కేంద్రం ముందే నిలబడ్డారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా దూరం తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande