
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) సంక్షోభం వేళ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక ప్రకటన చేసింది. గతవారం అంతరాయం కారణంగా వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు (impacted passengers) రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్ వోచర్ల (travel vouchers)ను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వోచర్లు డిసెంబర్ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఇండిగో స్పష్టం చేసింది. ఈ ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు