ప్రణాళికాయుతంగా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, 11 డిసెంబర్ (హి.స.) జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 21వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర రూ.4 లక్షల తో సీసీ రోడ్డు నిర్
జగిత్యాల ఎమ్మెల్యే


జగిత్యాల, 11 డిసెంబర్ (హి.స.)

జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 21వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర రూ.4 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ అధికారులు,ప్రజలు ఇంటి నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించే ముందు ముందు తరాల కోసం ఆలోచన చేయాలని,సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని కోరారు. ఒక్కో చెరువు కు రూ.3.5 కోట్ల తో మోతే,చింత కుంట చెరువు పురుద్ధరణకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 9 గ్రామాలు ఏకగ్రీవం కావడం ఆనందదాయకమని, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న అందరూ ఎన్నిక అయ్యారని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande