కామారెడ్డి జిల్లాలో ఎన్నికలను బహిష్కరించిన తండావాసులు
కామారెడ్డి, 11 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్
ఎన్నికల బహిష్కరణ


కామారెడ్డి, 11 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు.

దీంతో స్పందించిన కామారెడ్డి ఆర్డీవో వీణ గ్రామానికి చేరుకుని తండావాసులతో చర్చించారు. అయినా తండావాసులు ఓట్లు వేయమని నిరాకరించారు. అలాగే పోలింగ్ కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande