పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలి.. ఖమ్మం ఎంపీ
భద్రాద్రి కొత్తగూడెం, 11 డిసెంబర్ (హి.స.) పాల్వంచ రూరల్ పంచాయతీ రెండవ విడత ఎలక్షన్స్ కు ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి గురువారం విస్తృతంగా ప్రచారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాల్వంచ మండలంలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థును గెలిపి
ఖమ్మం ఎంపీ


భద్రాద్రి కొత్తగూడెం, 11 డిసెంబర్ (హి.స.)

పాల్వంచ రూరల్ పంచాయతీ రెండవ విడత ఎలక్షన్స్ కు ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి గురువారం విస్తృతంగా ప్రచారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాల్వంచ మండలంలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థును గెలిపించాలని, ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే పంచాయతీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, అప్పుల ఊబి నుంచి ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తూ ఉందని అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అభివృద్ధి చేశామని తమ ఖజానాలను నింపుకున్న బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ కు పట్టం కట్టారని, పంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande