సమస్యాత్మక గ్రామాలపై SP నితిక పంత్ ఫోకస్..
కొమరం భీం, 11 డిసెంబర్ (హి.స.) సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కొమరం భీం జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆ
ఆసిఫాబాద్ ఎస్పీ


కొమరం భీం, 11 డిసెంబర్ (హి.స.)

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కొమరం భీం జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న భద్రత ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande